మెగా స్టార్ చిరంజీవి -డైరెక్టర్ అనిల్ రావిపూడి ల మెగా 157 థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈరోజు నుండి ఈషెడ్యూల్ కేరళలోని అలప్పిలో ప్రారంభమైంది.చిరు ,నయనతార లపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు.భాను మాస్టర్ ఈసాంగ్ కి కొరియోగ్రఫీ అందిస్తుండగా అనంత్ శ్రీరామ్ రచించాడు.ఈనెల 23 వరకు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఇక అనుకున్న ప్రకారం షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.పెద్దగా బడ్జెట్ పెట్టనివ్వకుండా అందమైన లొకేషన్స్ లో షూటింగ్ ని కానిచ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్టోబర్ లోపు షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఇందులో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా కన్నా ముందు చిరంజీవి ,విశ్వంభరతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ప్రస్తుతం ఈసినిమా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటుంది.ఇంకో సాంగ్ షూట్ కూడా బ్యాలెన్స్ వుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























