హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.పేరుకు హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడం తో తెలుగులో కూడా సూపర్ హైప్ వుంది.అందుకు తగ్గట్లే తెలుగు రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.తెలుగులో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హిందీ సినిమా కూడా ఇదే. టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ వార్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ దక్కించుకున్నాడు. ఇక ఈసినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు. ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే సాంగ్స్ కంటే ముందే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ కూడా రెడీ అయిపొయింది.వచ్చే వారంలోనే ఈ ట్రైలర్ ను వదలనున్నారు. ట్రైలర్ తో బజ్ మరింతగా పెంచాలని చూస్తున్నారు.ఇక ఇందులో రెండు పాటలు వుండనున్నాయి.అందులో ఒకటి హృతిక్ – కియారా మీద వచ్చే రొమాంటిక్ సాంగ్ కాగా మరొకటి హృతిక్ – ఎన్టీఆర్ పేస్ ఆఫ్ సాంగ్. ఈ పాట లో వీళ్లిద్దరు వేసే స్టెప్స్ హైలైట్ అవ్వనున్నాయి.
అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా హిందీ , తెలుగు తోపాటు తమిళం లోకూడా విడుదలకానుంది. అయితే అదే రోజు లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























