సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణించి ఒకరోజు గడవక ముందే మరో ప్రముఖ నటి మరణించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ ప్రపంచాన్ని అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి గారు తాజాగా కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సులో బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1942లో కర్ణాటకలో జన్మించిన సరోజా దేవి 13 ఏళ్ల ప్రాయంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1950ల చివరి దశలో సినిమాల్లోకి ప్రవేశించిన సరోజాదేవి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి దక్షిణ భారత సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి మహానటులతో కలిసి ఆమె నటించిన చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో నటిగా 200కి పైగా సినిమాలలో నటించారు.
‘ఆత్మబలం’ సినిమాలో నాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ అనే ఎవర్ గ్రీన్ పాటలో నర్తించింది సరోజాదేవే. దీనితోపాటు ఏఎన్నార్ తో ‘పెళ్లి కానుక, శ్రీ కృష్ణార్జున యుద్ధం, రహస్యం, అమరశిల్పి జక్కన్న’ వంటి చిత్రాలు చేసిన సరోజా దేవి.. ఎన్టీఆర్‌తో ‘జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు దాగుడు మూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్య చక్రం, ఉమాచడీ గౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూరకర్ణ’ వంటి చిత్రాలలో నటించారు.
కళామ్మతల్లికి ఆమె చేసిన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం ఆమెకి 1969లో ‘పద్మ శ్రీ’ 1992లో ‘పద్మ భూషణ్’ అవార్డులతో సత్కరించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డ్ ఇచ్చింది. ఇంకా 2007లో రోటరీ శివాజీ అవార్డ్, ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, పలు సౌత్ వార్డ్స్ కూడా దక్కించుకుంది. అలాగే 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, నాట్య కళాధర అవార్డులను అందుకున్నారు. వీటితోపాటుగా 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలన చిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు.
ఆమె నటించిన చిత్రాలు ఎన్నో సంవత్సరాలపాటు పునఃప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెండితెరపై అందం, అభినయం, గాంభీర్యం కలబోసిన అద్భుత నటిగా ఆమె ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. సరోజాదేవి గారి మృతి చిత్రసీమకు తీరని లోటు. ఆమె సేవలు, సాంస్కృతిక స్పర్శ తెలుగుతెరపై చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























