తన సినిమాల్లో నటిస్తే సరిపోదు, జీవించాలి

Actor Manoj Chandra Thanks Rana Daggubati For His Support on Kothapallilo Okappudu

స్టార్ హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో ఇది ఒక చోటు. కానీ ఈ సినిమా మా గుండెల్లో చోటు. 18 వ తారీఖున మీ గుండెల్లోకి దూసుకొస్తున్నాము. మా కలని నిజం చేసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్రవీణ గారికి కృతజ్ఞతలు. స్పిరిట్ మీడియా ద్వారా నన్ను పరిచయం చేస్తున్న రానా గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మీరందరూ థియేటర్స్ కొచ్చి సపోర్ట్ చేసి మా సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రవీణ పరుచూరి సినిమాల్లో నటించాలంటే నటిస్తే సరిపోదు, జీవించాలి. అలా రామకృష్ణ క్యారెక్టర్‌కి నేను ప్రాణం పోశాను. మీరందరూ కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. తప్పకుండా థియేటర్స్ లోకి రండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యము. థాంక్యూ సో మచ్” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.