గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా టైటిల్, మరో రెండు ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ దేశవ్యాప్తంగా హ్యూజ్ బజ్ సృష్టించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ అయింది. గత కొంతకాలం క్రితం ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మను ‘రామ్ బుజ్జి’ గా పరిచయం ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పెద్ది టీమ్ అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ అందించింది. తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తోన్న ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. నేడు ఆయన జన్మదినం సందర్భంగా శివన్నను ‘గౌర్నాయుడు’గా పరిచయం చేసింది. ఇంటెన్స్ చూపు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో శివ రాజ్‌కుమార్ కనిపించిన తీరు అదిరిపోయింది. ఈ పవర్ ఫుల్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























