అశోక్ గల్లా ‘వీసా’ టీజర్ రిలీజ్

Ashok Galla's VISA Teaser Out

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన మూడో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. తొలిచిత్రం ‘హీరో’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను, రెండో సినిమాగా మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో రూపొందిన ‘దేవకీ నందన వాసుదేవ’తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘వీసా’ అనే చిత్రంతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ‘వింటారా సరదాగా’ అనేది ట్యాగ్ లైన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా వీసా సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ టీజర్‌ను గమనిస్తే.. అమెరికాలో స్థిరపడేందుకు వెళ్లిన హీరో, అతని స్నేహితుల బృందం చేసే అల్లరి, హంగామా హిలేరియస్‌గా ఉంది. వైవా హర్షకి మరోసారి మంచి రోల్ పడినట్టు అనిపిస్తోంది. అలాగే హీరో, హీరోయిన్ లవ్ సీన్స్ బావున్నాయి. వీరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.

కాగా ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.