కూలీ సెకండ్ సింగిల్ రిలీజ్

Coolie Second Single Monica is out now

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ. లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున , ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.మోనికా అంటూ ఈసాగే సాంగ్ ను పూజా హెగ్డే ,మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ లపై చిత్రీకరించారు.ఇందులో పూజా గ్లామర్ గా కనిపించి స్టెప్పులతో అదరగొట్టగా సౌబిన్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడు.శాండీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు. ఓవరాల్ గా సాంగ్ అయితే రిపీట్స్ లో వినాలనే వుంది.

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా కానుంది.అయితే ఈసినిమాకు హిందీ,తెలుగులో వార్ 2తో పోటీ ఎదురుకానుంది.ఈసినిమా కుడా అదే రోజున విడుదలవుతుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.