మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి. అంతేకాదు 45నిమిషాల విఎఫ్ఎక్స్ సన్నివేశాలను చూసి చిరంజీవి చాలా ఇంప్రెస్ అయ్యారట. ఓ సాంగ్ అలాగే ప్యాచ్ వర్క్ మినహా సినిమా కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా సెట్ లోని వర్కింగ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇందులో డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవికి సీన్ వివరిస్తూ కనిపించాడు.ఇక ఈ స్టిల్ లో చిరు లుక్ ఆకట్టుకుంది. ఇందులో చాలా యంగ్ గా స్టైలిష్ గా కనిపించాడు.ఈ వర్కింగ్ స్టిల్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వంభరలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆషికా రంగనాథ్,కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 చేస్తున్నారు.రీసెంట్ గానే థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.సంక్రాంతికి వస్తున్నాంలాగే అనిల్ ఈసినిమా కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు.నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.ఈ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఈసినిమాను కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో చేయనున్నాడు చిరంజీవి.నాని, సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనుండగా చిరు కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం గా తెరకెక్కనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























