తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఓ కొత్త దారిలో నడిపించినవారిలో ముందుంటారు స్వరబ్రహ్మ మణిశర్మ. మెలోడీ, మాస్ బీట్స్, క్లాసికల్ టచ్, ఫ్యూజన్ – ఏ మూడ్ కైనా ఆయన సంగీతం సంగీత ప్రియులకు ఆస్వాదనను కలిగిస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో ఆయన పాటలు హిట్ అయి, సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. నేడు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మణిశర్మ గురించి స్పెషల్ స్టోరీ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మణిశర్మ అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1964 జూలై 11న కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించారు. ఆయన చిన్ననాటినుంచే సంగీతంపై మక్కువ ప్రదర్శించేవారు. దీంతో ఆయన తండ్రి, వయొలిన్ కళాకారుడు అయిన యనమండ్ర నాగయజ్ఞ శర్మ హార్మోనియంలో మెళకువలు నేర్పించారు. మరోవైపు సినిమాల్లో పనిచేయాలనే కోరికతో నాగయజ్ఞ శర్మ కుటుంబంతో సహా మద్రాసు చేరుకున్నారు. దీంతో మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే.
చిన్నప్పుడే మణిశర్మ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత తండ్రి సలహా మేరకు కీబోర్డ్ కూడా నేర్చుకున్నారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు, వందేమాతరం శ్రీనివాస్ వంటి మేటి దర్శకుల దగ్గర పనిచేశారు.
ఇంకా ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటి వంటి అగ్ర సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేసారు మణిశర్మ. స్టార్ కంపోజర్ ఎ.ఆర్. రహ్మాన్‌తో కలిసి కీబోర్డు సహాయకుడిగా పనిచేశాడు. అనంతరం ప్రముఖ కమెడియన్ ఏ.వి.యస్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సూపర్ హీరోస్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ఈ సినిమా తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘బావగారూ.. బాగున్నారా?’ (1998) చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం అందిపుచ్చుకున్నారు.
ఆ తర్వాత “చూడాలని ఉంది (1998), సమరసింహా రెడ్డి (1999), దేవీ పుత్రుడు (2001), ఖుషి (2001), ఇంద్ర (2002), టక్కరి దొంగ (2002), ఒక్కడు (2003), వర్షం (2004), గుడుంబా శంకర్ (2004), బాలు (2005), అతడు (2005), ఛత్రపతి (2005), పోకిరి (2006)” చిత్రాలకు ఆయన అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం అందించడంలో ఆయన అగ్రగణ్యులు. ఇలా తెలుగు, తమిళం సహా మొత్తం 200కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ట్యూన్ మరియు బీజీఎం రెండింటినీ సమంగా హ్యాండిల్ చేసే నైపుణ్యం, లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడకంలో మణిశర్మ నిష్ణాతులు. ప్రస్తుత మ్యూజిక్ డైరెక్టర్లకు ఆదర్శంగా నిలిచిన గొప్ప సంగీత దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి ఘనకీర్తి కలిగిన మణిశర్మ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకెన్నో ఉత్తమ చిత్రాలకు పనిచేయాలని, తద్వారా తన సంగీతంతో ప్రేక్షకులను అలరించాలని, అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























