ఆంధ్ర కింగ్ తాలూకా లాంగ్ షెడ్యూల్ స్టార్ట్

The long shooting schedule of Andhra King Taluka begins today

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబు పి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది.దాదాపు 35 రోజులపాటు జరుగనున్న ఈషెడ్యూల్ హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ప్రారంభమైంది.ఇందులో 10 రోజులపాటు రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ బోర్స్ జంటపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతరం తదుపరి 20 రోజులు క్లైమాక్స్ సీన్లు షూట్ చేయనున్నారు.ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి కానుంది.ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివేక్–మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే ఈసినిమానుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు.ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ అయితే బాగా వచ్చిందట.దాంతో గత కొన్నేళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు ఆంధ్ర కింగ్ తాలూకా సాలిడ్ హిట్ ఇచ్చేలానే ఉంది.సెప్టెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.