వరుస పరాజయాల తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కింగ్డమ్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈనెల 31న రిలీజ్ కానుంది. విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్టన్ ఎంటర్టైనర్ కావడంతో కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు విజయ్. అందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఎలా స్టార్ట్ అయ్యిందని అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానంగా … గౌతమ్ రెండు స్క్రిప్టులతో వచ్చాడు. కింగ్డమ్ మరియు ఇంకోటి. నేను కింగ్డమ్ ని ఎంచుకున్నాను, ఎందుకంటే ఇంకో స్క్రిప్ట్ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ సినిమాకు చాలా దగ్గరగా అనిపించింది.ఆ సినిమా దర్శకులు నాకు తెలుసు. మనం ముందే పూర్తి చేసేందుకు వీలున్నా, అది నైతికంగా సరికాదు అనిపించింది అలాగే వారి పని పట్ల గౌరవం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కథల మధ్య చాలా పోలికలు ఉండటం వల్ల నేను కింగ్డమ్ ను ఎంపిక చేసుకున్నానని విజయ్ అన్నారు. దాంతో ఇంకో సినిమా ఏమైవుంటుందా అని సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.
ఇక కింగ్డమ్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హిట్ టాక్ వస్తే కింగ్డమ్ విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























