ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కోర్ట్.దాదాపు 50 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నేచురల్ స్టార్ నాని ఈసినిమాగా నిర్మాతగా వ్యవహరించాడు.ఇక ఈసినిమా ద్వారా కాకినాడ అమ్మాయి శ్రీదేవి హీరోయిన్ గా పరిచయమైంది.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత శ్రీదేవి ఓ తమిళ సినిమాకు సైన్ చేసింది.కె జె ఆర్ పక్కన హీరోయిన్ గా శ్రీదేవి కనిపించనుంది.ఈసినిమా నిన్న గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా బ్లాక్ బస్టర్ మార్క్ అంటోనీ నిర్మించిన మినీ స్టూడియోస్ ఈసినిమాను నిర్మింస్తుంది.
ఇక హీరో కోటపాడి జె రాజేష్ నిర్మాతగా ఇంతకుముందు తమిళంలో విశ్వాసం ,హీరో ,అయాన్ వంటి భారీ సినిమాలు నిర్మించాడు.కేజేఆర్ కి హీరోగా ఇది రెండో సినిమా.ఇంతకుముందు అంగీకారం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మరి ఈసినిమాతో శ్రీదేవి హీరోయిన్ గా అక్కడ బిజీ అవుతుందో చూడాలి.ఇక తెలుగులో మాత్రం కోర్ట్ తరువాత శ్రీదేవి ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























