బాలీవుడ్ సినీనటుడు, స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం తోడ్పడేందుకు అజయ్ దేవ్గన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒక అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను హైదరాబాద్లో నిర్మించేందుకు దేవగన్ ఆసక్తి కనబరిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ స్టూడియోలో సినిమా నిర్మాణంలో కీలకభూమిక పోషించే యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ సహా మరికొన్ని సాంకేతిక హంగులు, సదుపాయాలను కల్పించనున్నారు. ఈ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవ్గన్ రేవంత్ రెడ్డిని కోరారు. దీనితోపాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను తయారుచేసేందుకు ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు అజయ్ ఇంట్రెస్ట్ చూపించారు.
ఇక తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవగన్ ముఖ్యమంత్రికి తెలిపారు. మరోవైపు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేయడంలో సహకారం అందించాలని కపిల్ దేవ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























