యంగ్ హీరో సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
- దర్శకుడు రామ్ నేను తమిళంలో నటించిన చిత్రం ‘జో’లో నా అభినయం చూసిన తర్వాత ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకున్నాడు.
- కథ వినగానే నాకు ఎంతో నచ్చింది.
స్టోరీలో మీకు నచ్చిన అంశాలేమిటి?
- అది సింగిల్ లైన్‌లో చెప్పలేను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది.
- గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్ సింపుల్ గర్ల్‌గా చేశాను.
- ఈ సినిమాలో నా పాత్ర ఎంతో మోడ్రన్‌గా, హైపర్‌గా, యాటిట్యూడ్‌తో ఉంటుంది.
- ప్రతి నటికి కావాలసిన వైవిధ్యమైన పాత్ర లభించింది.
- ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను
ఈ పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
- ఈ సినిమా కోసం ఎలాంటి వర్క్ పాప్, హోంవర్క్ చేయలేదు.
- నా రియల్ లైఫ్‌కు ఎలాంటి కంపారిజిన్ లేని పాత్ర సత్యభామ పాత్ర.
- నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను.
తెలుగులో నటించడం ఎలా అనిపించింది?
- చాలా హ్యపీగా అనిపించింది. తెలుగు టెక్నిషియన్స్, ఆర్టిస్ట్‌ల్లో ఎంతో ప్రొఫెజనలిజం వుంది.
- ఎంతో కంపర్టబుల్‌గా నటించాను. లాంగ్వేజ్ తప్ప నాకు తెలుగులో ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించలేదు.
- అన్ని లాంగ్వేజ్‌ల మాదిరిగా నాకు ఇక్కడ కంఫర్టబుల్‌గా అనిపించింది.
ఈ చిత్రంలో ఛాలెంజింగ్ అనిపించిన సన్నివేశం ఏమైనా?
- ఈ సినిమా కోసం నాకు స్విమింగ్ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే స్విమింగ్ చేశాను.
- నాకు ఎంతో భయమేసినా సినిమా కోసం చేశాను.
తెలుగు నేర్చుకున్నారా?
- ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను.
- తెలుగు అర్థం అవుతుంది.. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా సినిమాలు చూస్తుంటాను.
- ఇటీవల తెలుగు హిట్-3 సినిమా చూశాను.
చాలెంజింగ్ రోల్స్ ఏమైనా చేయాలని ఉందా?
- నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా చాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంటుంది.
- ప్రతి సినిమాలో రొటిన్ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది.
- నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం.
హరీశ్ శంకర్, మారుతిలతో నటించం ఎలా ఉంది?
- వెరీ నైస్ వర్కింగ్ విత్ గ్రేట్ పర్సన్స్.
సుహాస్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ?
- వెరీ నైస్ పర్సన్. ఎంతో హార్డ్‌వర్క్ చేస్తాడు.
- సినిమా సెట్‌లో సినిమా కోసం మాత్రమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్ పర్సన్ కాదు. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో లవ్ సీన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి?
- జనరల్‌గా అన్ని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలే అయినా ఈ సినిమాలో లవ్ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుంది.
- తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్ అవుతారు. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో నటించడం ఎలా ఉంది?
- ఈ సినిమా చేయడం, ఇలాంటి పాత్ర లభించడం, సత్యభామ పాత్ర చేయడం నేను ఎంతో లక్కీగా భావిస్తున్నాను.
మీ ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి?
- సినిమా నేపథ్యంతో సంబంధం లేని ఫ్యామిలీ నాది.
- అయినా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే నటిస్తున్నాను.
- కానీ అందరూ బంధువులు మొదట్లో భయపడ్డారు.
- నాకు మాత్రం ఎలాంటి భయం లేదు.
- సినిమాల్లో నటించడం గర్వంగా ఉంది.
- ఇప్పుడు ట్రైలర్ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు.
సుహాస్ గత సినిమాలు ఏమైనా చూశారా?
- కలర్ ఫోటో, హిట్ 2 చూశాను.
సినిమాల ఎంపిక విషయంలో మీరు పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏమిటి?
- నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. నాకు నచ్చిన కథలతో మాత్రమే చేస్తున్నాను.
- నా కంఫర్ట్ జోన్‌లో సినిమాలు చేస్తున్నాను. నేను ఆ రోల్ ఫిట్ అనుకుంటేనే చేస్తున్నాను.
- మలయాళ ఫిల్మ్ ఫస్ట్ చేశాను. ‘జో’ తమిళ చిత్రం.
ఈ సినిమా పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది? మీకు నచ్చిన పాట ఏది?
- అన్ని పాటలు నాకు బాగా నచ్చాయి.
- లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికి నచ్చాయి.
- అన్ని పాటలు నా మనసుకు హత్తుకున్నాయి.
నిర్మాత హరీష్ గురించి..
- నిర్మాత ఎంతో నైస్ పర్సన్.
- సినిమాకు ఎంత కావాలో చాలా రిచ్‌గా ఖర్చు పెట్టాడు.
- సినిమా అంటే ఆయనకు ఎంతో ఇష్టం.
గ్లామరస్ రోల్స్ చేస్తారా?
- గ్లామరస్ రోల్స్.. చేయాలా వద్దా? అనే నిబంధన నాకు లేదు.
- కథ నచ్చితే నాకు కంఫర్టబుల్‌గా అనిపించిన రోల్స్ మాత్రమే చేశాను.
- నాకు నచ్చని పాత్రలు నేను చేయను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























