ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.మూడేళ్ళ క్రితం చిన్న సినిమాగా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.ఒక్క కన్నడలోనే కాదు తెలుగు ,హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ తో సీక్వెల్ కూడా వస్తుంది.దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే రిలీజ్ డేట్ పై ఇప్పటికే పలు సార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయినా కూడా సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ రావడంతో మరోసారి రిలీజ్ డేట్ ను కంఫర్మ్ చేసింది కాంతర టీం.ఈరోజు ఈసినిమా హీరో ,డైరెక్టర్ రిషబ్ శెట్టి పుట్టిన రోజు కావడంతో ఈసినిమా నుండి పోస్టర్ రిలీజ్ చేశారు.ఇందులో మొదట ప్రకటించిన డేట్ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ కానుందని మరోసారి కన్ ఫర్మ్ చేశారు.దాంతో సినిమా పక్కాగా ఆ డేట్ రానుంది.షూటింగ్ కూడా పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈసీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇక రిషబ్ శెట్టి ఈసినిమాతోపాటు ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్ లో కూడా నటిస్తున్నాడు.హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























