ప్రముఖ నిర్మాత , దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు.నిజానికి శిరీష్ కూడా వివాదాస్పదంగా ఏం మాట్లాడలేదు. గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ అయ్యాక డైరెక్టర్ గాని హీరో గాని కనీసం మాకు ఫోన్ చేసి ఎలా వున్నారు అని కూడా పలకరించలేదు అని శిరీష్ ఇంటర్వ్యూ లో అన్నారు.దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ను అనడం ఏంటని హార్ట్ అయ్యారు. అయితే ఈవివాదం ముదురుకముందే శిరీష్ నిన్న ఓ లెటర్ ను కూడా విడుదలచేశారు. నా మాటల వల్ల మెగా ఫ్యాన్స్ ఎవరైనా బాధ పడితే క్షమించండి అని ఆ లెటర్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు వీడియో ద్వారా మరోసారి క్షమాపణలు చెప్పుకొచ్చారు శిరీష్.మెగా హీరోలందరితోనూ మాకు మంచి అనుబంధం ఉంది.వరుణ్ తేజ్ గారితో ఫిదా చేశాం.సాయితేజ్ గారితో రెండు సినిమాలు చేశాం.చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం.చిరంజీవి గారు దిల్ రాజు గారితో, మాతో మాట్లాడుతూనే ఉంటారు.ఇంత మంచి అనుబంధం ఉన్నవారిని అవమానపరిచే అంత మూర్ఖుడిని కాదు. దయచేసి అభిమానులందరూ అర్థం చేసుకోవాలి.
చరణ్ తో నాకు చాలా సన్నిహిత్యం వుంది.నేను ఎందుకు చరణ్ గారిని అంటాను.నేను మొదటి సారి ఇంటర్వ్యూ ఇచ్చాను.ఆ క్రమంలో ఏదైనా తప్పు దొర్లివుండచ్చు.అందుకు నా క్షమాపణలు చెప్తున్నా.చరణ్ గారికి నాకు మంచి అనుబంధం వుంది.దయచేసి దాన్ని చెడగొట్టవద్దు. ఫ్యాన్స్ కి అలాగే చరణ్ గారికి నేను క్షమాపణలు చెప్తున్నాను. త్వరలోనే చరణ్ గారితో ఇంకో సినిమా చేయనున్నాం.అంటూ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు శిరీష్.మొత్తానికి ఈవీడియోతో మెగా ఫ్యాన్స్ కూడా కూల్ అవ్వడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్లే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























