అఖండ 2లో ‘భజరంగీ భాయీజాన్’ నటి

Team Akhanda 2 Introducing Bajrangi Bhaijaan Fame Harshaali Malhotra as JANANI

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా కావడం విశేషం. గత నెలలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు నేషనల్ వైడ్‌గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టీజర్ అదరగొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లొకేషన్స్‌లో, ఆ తర్వాత ఆర్‌ఎఫ్‌సీలో కీలకమైన యాక్షన్ సీన్స్‌ని షూట్ చేశారు. చాలావరకు టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఒక బాలీవుడ్ నటి భాగమైంది. సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా నటిస్తోంది.

సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇందులో ఆమె ‘జనని’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు నేడు అఖండ 2 టీమ్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె సాంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తుంది.

ఇక అఖండ 2లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. అలాగే టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇక ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.