మహావతార్ నరసింహా నుంచి హిరణ్యకశిపుడి క్యారెక్టర్ ప్రోమో రిలీజ్

Hiranyakashipu Promo Unveiled From Mahavatar Narsimha

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ – మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోస్తుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా మొత్తం 6 చిత్రాలు తెరకెక్కనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో నిర్మాతలు శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ‘మహావతార్ నరసింహా’, మొదటి భాగం జూలై 25, 2025న ఐదు ప్రధాన భారతీయ భాషలలో అత్యాధునిక 3D ఫార్మాట్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి హిరణ్యకశిపుడి క్యారక్టర్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉన్న హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తుంది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన సంగీతం, కాలాన్ని ప్రతిధ్వనించే పౌరాణిక వైభవంతో ఈ ప్రోమో అధర్మం రాజ్యమేలుతున్న యుగం యొక్క తీవ్రతను ప్రజెంట్ చేస్తోంది.

అత్యాధునిక VFX, 3D విజువల్స్ , పవర్ ఫుల్ బీజీఎంతో, మహావతార్ నరసింహ భారతీయ సినిమాలో పౌరాణిక కథ చెప్పే స్కేల్ ని రీడిఫైన్ చేస్తోంది. ఇది డివైన్ యూనివర్స్, విష్ణువు దశ అవతారాల అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో అలరించబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.