ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో చిరు

Megastar Chiranjeevi visited the sets of Ustaad Bhagat Singh

పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్టైన విషయం తెలిసిందే. ఈసినిమా కోసం పవన్ ఏకంగా నెల రోజులపాటు డేట్స్ ఇచ్చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతుంది.ఇక ఈసినిమా షూటింగ్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి కాసేపు సందడి చేశారు.నిన్న చిరు ఈ సినిమా సెట్ కు వెళ్లగా అదే సమయంలో పవన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.ఇందులో శ్రీలీల ఓ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
.
ఇక ఇదిలావుంటే రీసెంట్ గా పవన్ హరి హర వీర మల్లు ,ఓజీ సినిమాలు కూడా పూర్తి చేశాడు. ఇందులో హరి హర వీరమల్లు ఈనెల 24న రిలీజ్ కు రెడీ అవుతుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

ఇక కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ వుంది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.