బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఒక్క సాంగ్ షూట్ బ్యాలన్స్ వుండగా ఈరోజు నుండి షూట్ స్టార్ట్ చేశారు. ముంబై లోని యాష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో 500మంది డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నారు.బోస్కో – సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.హృతిక్, ఎన్టీఆర్ లు ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు కావడంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ సాంగ్ పై అంచనాలు భారీగా వున్నాయి.దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ కొనసాగనుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈసాంగ్ ను కంపోజ్ చేయగా బోస్కో – సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే హిందీ లో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తుండగా మిగితా భాషలకు గాను ఇప్పటికే తమిళ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగు రైట్స్ కు అయితే భారీ పోటీ వుంది.నిర్మాతలు దాదాపు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట.టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈసినిమా రైట్స్ ను తీసుకోవాలని చూస్తున్నాడు.
అయితే ఈసినిమా రిలీజ్ అవుతున్న రోజే లోకేష్ కనగరాజ్ -రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదురుకానుంది.వార్ 2ను బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























