పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే 4 పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. జూలై 3న థియేట్రికల్ ట్రైలర్ కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బూస్ట్ ఇచ్చేలా చేసిన ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మేరకు ఎక్స్ వేదికగా నాగవంశీ.. “మీరందరూ ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు.. కానీ జూలై 3న రాగానే మీకు ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తుంది! పవన్ కళ్యాణ్ గారి ఫైర్ ఏంటో చూస్తారు. సిద్ధంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. హరిహర వీరమల్లు ట్రైలర్ నిజంగా అత్యున్నత స్థాయిలో ఉంది. ఇది లార్జ్ స్కేల్‌లో, మ్యాడ్‌నెస్‌తో మరియు మీరు ఇదివరకు చూడని శక్తితో వస్తుంది. మీరు దానిని అనుభూతి చెందుతారు. మీరు దాని గురించి మాట్లాడుతారు.” అని పేర్కొన్నారు.
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించగా.. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























