అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ రివీల్

Allari Naresh's New Film Titled Alcohol and First Look Released

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం కథానాయకుడిగా తన 63వ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లో నరేష్ ముఖం సగంవరకూ ఆల్కహాల్‌లో మునిగిపోయినట్టుగా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో రుహాని శర్మ హరోయిన్‌గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని కీలక అప్డేట్స్ త్వరలోనే అందించనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.