హీరో సిద్ధార్థ్ 40వ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ గణేష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నేను తెలుగు మాట్లాడలేను గాని చాలా తెలుగు సినిమాలు చూశాను. నాకు తెలుగు అర్థం అయిపోతుంది. అదే సినిమాకు ఉన్న బ్యూటీ. మా టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నాకు ఒక బిగ్ అచీవ్‌మెంట్. ఇది నాకు మెమొరబుల్ థింగ్. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మీరందరూ కూడా ఈ సినిమాను చూసి అంత ప్రేమ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. తెలుగులో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ. తెలుగులో ‘బొమ్మరిల్లు’ అందరికీ కనెక్ట్ అయింది ఈ సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉందని సిద్ధార్థ్ గారు చెప్పారు. అలాగే మా సినిమాకి కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























