ఏఎన్నార్ దేవ‌దాసుకి 72 ఏళ్ళు.. స్పెషల్ వీడియో రిలీజ్

ANR's Devadasu Movie Completes 72 Years, Team Released Special Video

తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం అగ్ర న‌టుడు అక్కినేని నాగేశ్వరరావు సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అజరామరమైన సినిమాలలో నటించారు. అయితే ముఖ్యంగా తొలినాళ్లలో ఆయనను ప్రేక్షకులకు చేరువ చేసిన చిత్రం ‘దేవ‌దాసు’. ఈ సినిమాతో ఏఎన్నార్ సాంఘిక చిత్రాల కథానాయకుడిగా, అమర ప్రేమికుడిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ కల్ట్ క్లాసిక్ విడుద‌లై నేటికి 72 ఏళ్లు అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ స్పెష‌ల్ వీడియోను పంచుకుంది. ప్రముఖ బెంగాలీ కవి శరత్ చంద్ర చటర్జీ రచించిన ‘దేవ్‌దాస్‌’ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. 1953, జూన్ 26న విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అక్కినేని, సావిత్రిల నటనకు ఘంటసాల అద్భుతమైన సంగీతం తోడవడంతో ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాతో సావిత్రి తొలిసారి కథానాయికగా పరిచయమైంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.