మచ్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కన్నప్ప మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంపుకి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విడుదలైన నాటినుంచి పదిరోజులపాటు అమలులో ఉండనుంది.ప్రమోషనల్ కంటెంట్ కు తోడు రెబల్ స్టార్ ప్రభాస్ ఉండడం తో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. హిట్ టాక్ వస్తే తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంచు విష్ణు ఈసినిమాకోసం భారీగా ఖర్చు చేశాడు.తన డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అన్ని భాషల్లో బడా డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకున్నారు.దాంతో కన్నప్ప సుమారు 5 వేలకుపైగా స్క్రీన్ లలో విడుదలవుతుంది. ఈసినిమా 3 గంటల రన్ టైం తో రానుండగా ప్రభాస్ ఇందులో దాదాపు 30 నిమిషాలు కనిపించనున్నాడట.
శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా మంచు విష్ణు నటించగా మోహన్ బాబు ,ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























