భారతీయ సినిమా రంగాన్ని పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిల్మ్స్, భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ సంస్థ, ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అనే గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇది భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని లార్డ్ విష్ణు దశావతారాలను కట్టింగ్ ఎడ్జ్ యానిమేషన్, గొప్ప స్టొరీ టెల్లింగ్, సినిమాటిక్ స్కేల్‌లో రీఇమాజిన్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహావతార్ యూనివర్స్ 12 సంవత్సరాల ప్లానింగ్ తో ప్రారంభమవుతుంది. ఈ పయనం మొదటి అడుగు మహావతార్ నరసింహ రూపంలో, జూలై 25, 2025న 3D ఫార్మాట్‌లో, భారతదేశంలోని ఐదు ప్రధాన భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు అశ్విన్ కుమార్, నిర్మాతలు శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ వైరల్ గా మారి మేకర్స్ విజన్‌పై అంచనాలను పెంచింది.
తాజాగా ‘మహావతార్ నరసింహ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రోర్ అఫ్ నరసింహ’ ను విడుదల చేశారు. స్టార్ కంపోజర్ సామ్ సి.ఎస్ ఈ పాటను డివైన్ వైబ్స్‌తో పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. సామ్ సి.ఎస్, రాకేందు మౌళి పవర్‌ఫుల్ సాహిత్యాన్ని అందించడమే కాక, అంతే ఎనర్జీటిక్‌గా కూడా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ..”భారతీయ వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో, మా క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి” అని అన్నారు. ఇక నిర్మాత శిల్పా ధవాన్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మన కథలు తెరపై అలరించబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణం.” అని పేర్కొన్నారు.
అలాగే హోంబలే ఫిల్మ్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. సరిహద్దులను దాటి చెప్పే కథనాలపై మాకు నమ్మకం ఉంది. మహావతార్ ద్వారా మన దేశపు ఆధ్యాత్మిక వారసత్వానికి ఓ గొప్ప నివాళిగా ఈ సినిమాటిక్ యూనివర్స్‌ను అందిస్తున్నాము” అని తెలిపారు. కాగా హోంబలే ఫిల్మ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్..ఈ డైనమిక్ కొలాబరేషన్ ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ కేవలం సినిమాలకే పరిమితం కాదు. ఇది ఓ సంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. గ్రాఫిక్ నవలలు, వీడియో గేమ్స్, డిజిటల్ కథనాలు, కలెక్టిబుల్స్ రూపంలో ఈ కథలు ప్రేక్షకులను విభిన్నంగా చేరనున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వయస్సు వారిని అలరించేలా ఈ యూనివర్స్ నిర్మాణం సాగుతుంది.
ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలన్న లక్ష్యంతో హోంబలే ఫిల్మ్స్ ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక వైవిధ్యమైన కథలను భారీ హంగులతో ఆడియెన్స్‌కి అందించింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1 & 2’, ‘సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్’, ‘కాంతార’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండియన్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా నిలిచింది. తద్వారా బాక్స్ ఆఫీస్ విజయాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రకటించిన ప్రాజెక్ట్స్ కూడా మ్యాసీవ్ స్కేల్‌లో రూపొండుతుండటం విశేషం. ఈ యూనివర్స్ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది. ఈ సిరీస్‌లో ముందుగా వచ్చే మహావతార్ నరసింహ జూలై 25, 2025న 3D మరియు ఐదు భారతీయ భాషలలో థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా “మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేసే సినిమాటిక్ అద్భుతానికి సిద్ధంగా ఉండండి! అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక మిగిలిన 6 సినిమాలు రెండేళ్ళకొకటి చొప్పున రిలీజ్ కానున్నాయి.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మరియు రిలీజ్‌ల వివరాలు..
– మహావతార్ నరసింహ (25 జూలై-2025)
– మహావతార్ పరశురామ్ (2027)
– మహావతార్ రఘునందన్ (2029)
– మహావతార్ ద్వారకాధీష్ (2031)
– మహావతార్ గోకులానంద (2033)
– మహావతార్ కల్కి పార్ట్ 1 (2035)
– మహావతార్ కల్కి పార్ట్ 2 (2037)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























