పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం స్పెషల్ గా వేసిన బ్లూ మ్యాట్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరి కొన్ని రోజులు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఆతరువాత జులైలో అల్లు అర్జున్ యూఎస్ వెళ్లనున్నాడు.అక్కడ జరిగే తెలుగు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.ఆ తరువాత మళ్ళీ ఇండియా వచ్చి షూటింగ్ లో పాల్గొననున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎక్కువ భాగం షూటింగ్ ముంబై లోనే జరుగనుందని సమాచారం.అంతేకాదు ఆగస్టు వరకు ఎలాంటి అప్డేట్ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది.ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.తెలుగులో తనకు ఇది రెండో సినిమా.ఈసినిమా కోసం దీపికా భారీ పారితోషికం తీసుకుంటుందట.
అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ను ఖరారు చేయాల్సివుంది.వచ్చే ఏడాదిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























