వకీల్ సాబ్ తరువాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ నుండి వస్తున్న సినిమా తమ్ముడు. ఇందులో నితిన్ హీరోగా నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.వచ్చే నెల 4న థియేటర్లలోకి రానుంది.ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ,సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఈసినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.తమ్ముడు కథ మొదట హీరో నాని దగ్గరకు వెళ్ళింది. ఏంసిఏ కు సీక్వెల్ గా ఈసినిమాను మొదలు పెడదాం అనుకున్నాం కానీ నాని ఆ టైం లో వేరే కమిట్ మెంట్ ల బిజీ గా ఉండడం తో కుదరలేదు. ఆతరువాత నితిన్ తో ఈసినిమాను అనుకున్నాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఈసినిమా మేకింగ్ కోసం ఏకంగా 35కోట్లు ఖర్చు పెట్టినట్లు దిల్ రాజు వెల్లడించారు.
బ్రదర్ -సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈసినిమాలో నితిన్ అక్కగా ప్రముఖ నటి లయ నటించింది.చాలా గ్యాప్ తరువాత లయ ఈసినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుండగా వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో కనిపించనుంది.అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసినిమాతోనైనా నితిన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























