మ్యాడ్ తరువాత మలయాళ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు.ఇందులో తను లీడ్ రోల్ లో నటించగా మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.గత శుక్రవారమే ఈసినిమా థియేటర్లలోకి రాగా డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమా వసూళ్ల పరంగా అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది.బాక్సాఫీస్ వద్ద కుబేర నుండి భారీ పోటీ ఎదురువుతుండడమే అందుకు కారణం.లేకుంటే 8 వసంతాలు మంచి వసూళ్లను దక్కించుకునేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా థియేట్రికల్ రన్ తరువాత నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.సినిమా రిలీజ్ అవ్వకముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయింది.అందులో భాగంగా ఈసినిమాను మంచి రేటుకి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.వచ్చే నెల మూడో వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.నిర్మాతలు కూడా థియేట్రికల్ రిలీజ్ కు ముందే సేఫ్ అయిపోయారు.
అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా,స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటించగా హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























