కూలీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

coolie first single coming on june 25th

సూపర్ స్టార్ రజినీకాంత్ – యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. కేవలం గ్లింప్స్ తోనే ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఈ బుధవారం మొదటి సాంగ్ చికిటు రిలీజ్ చేయనున్నారు.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఆడియోకు భారీ హైప్ వుంది.అంతేకాదు రజినీకి ఇప్పటివరకు అనిరుధ్ బెస్ట్ సాంగ్స్ ఇస్తూ వచ్చాడు.మరి ఈ చికిటు కూడా ఆ జాబితాలో చేరుతుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సత్య రాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.దాదాపు 8 నిమిషాలు అమీర్ ఇందులో కనిపించనున్నాడట.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవల్లో జరుగుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యింది.కోలీవుడ్ లోనే అక్కడ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా కూలీ రికార్డు సృష్టించింది. తెలుగులోకూడా భారీ రేటు చెప్తున్నారు.

భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజున హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుండడంతో తెలుగు, హిందీలో కూలీకి భారీ పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.