తమ్ముడు నుండి జై బగలాముఖి సాంగ్ రిలీజ్

Jai Bagalaamukhii Song Released From Nithiin's Thammudu

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో గ్లింప్స్‌ మరియు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా ఇటీవలే తమ్ముడు నుంచి ఫస్ట్ సింగిల్‌ ‘భూ అంటూ భూతం వస్తే’ పాటని రిలీజ్ చేసిన చిత్ర బృందం, తాజాగా రెండో పాటగా ‘జై బగలాముఖి’ అనే సాంగ్‌ని విడుదల చేసింది. ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం సమకూర్చగా.. గాయకుడు అబ్బి వి గాత్రం అందించారు. ఈ సాంగ్‌కి అజనీష్ లోకనాథ్ అద్భుతమైన డివైన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ పాట సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.