తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ తన 45వ సినిమాతో రానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు సూర్య.ఇక ఈసినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈచిత్రానికి కరుప్పు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సూర్య కత్తి పట్టుకొని కనిపించాడు.అయితే ఈపోస్టర్ ను ఫుల్ గా రివీల్ చేయలేదు.ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.అయితే ముందుగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ టైటిల్ ను మాత్రమే ఇచ్చారు.సూర్య బర్త్ డేకి గ్లింప్స్ కూడా రానుంది.ఇందులో స్వాసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























