కుబేర టికెట్ ధరల పెంపు

10 day ticket price hike for Sekhar Kammula’s Kuberaa

తెలుగులో చాలా రోజుల తరువాత మంచి హైప్ తో ఓ సినిమా రిలీజ్ అవుతుంది.అదే శేఖర్ కమ్ముల కుబేర.ఇందులో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున కలిసి నటించడం తో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు వున్నాయి.ఇక ఈ కాంబోకి తోడు ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.దాదాపు 3గంటల రన్ టైంతో రేపు ఈసినిమా థియేటర్లలోకి రానుంది. బుకింగ్స్ కూడా బాగున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా కుబేర యూఎస్ లో అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ 300K మార్క్ క్రాస్ చేసింది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 2మిలియన్ క్లబ్ లో చేరనుంది. అయితే ఈసినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలను పెంచారు.మొదటి 10రోజులకు గాను సింగిల్ స్క్రీన్ &మల్టీ ఫ్లెక్స్ లలో 75 రూపాయల వరకు పెంచుకునేలా ప్రభుత్వంనుండి అనుమతి లభించింది. తెలంగాణలో మాత్రం టికెట్ల ధరలలో మార్పు లేదు.

ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దాదాపు 100 కోట్లకుపైగా బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ నిర్మించాయి.ఇక గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది.బిగ్ హిట్ కొట్టడానికి కుబేరకు ఇదే మంచి ఛాన్స్.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.