యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం ‘నాగబంధం’ చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విరాట్ కర్ణ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రీ-లుక్ మరియు ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఒక కీలకమైన సన్నివేశాన్ని, ఒక పాటను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్‌లో చిత్రీకరించారు. అద్భుతంగా నిర్మించిన ఈ సెట్‌ని తాజాగా మేకర్స్ మీడియాకు ప్రదర్శించి సర్‌ప్రైజ్ చేసింది. కేరళలోని అసలు దేవాలయానికి కచ్చితమైన ప్రతిరూపంగా కనిపిస్తోందని ఎంతోమంది ప్రశంసించారు. ఈ పాటలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు.
ఈ అద్భుతమైన సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుంది. అయితే ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ‘నాగబంధం’ ఒక విజువల్ స్పెక్టకిల్‌గా ఉండబోతోంది. ఈ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్, అంతే స్థాయిలో నిర్మాణం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
పాన్ ఇండియన్ ఫిల్మ్ నాగబంధం పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పనిచేస్తుండగా.. అభే సంగీత దర్శకుడిగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు కాగా నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























