సుహాస్ ఓ భామ అయ్యే రామ రిలీజ్ డేట్ ఫిక్స్

Oh Bhama Ayyo Rama release date have been announced

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు యువ కథానాయకుడు సుహాస్‌.గత ఏడాది సోలో హీరోగా ఏకంగా 4 సినిమాలతో రాగా వచ్చే నెలలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓ భామ అయ్యో రామతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.మలయాళంలో జో అనే చిత్రంతో ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది.రామ్ గోధల దర్శకుడు.వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అదే రోజున టాప్ హీరోయిన్ అనుష్క నటించిన ఘాటి కూడా విడుదలవుతుంది దాంతో ఓ భామ అయ్యే రామకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్.అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరిస్తుంది.ఇదొక క్యూట్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీలా సినిమాలోని ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్‌ ఎంతో ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌.రామ్‌గా సుహాస్‌, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. హీరోయిన్‌ మాళవిక, హీరో సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి.ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము.ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ.అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం.తప్పకుండా ఈ చిత్రం సుహాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్‌ చేస్తారు అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.