కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కుబేర సినిమా కంటెంట్ మరియు దర్శకుడు శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమా జర్నీలో నన్ను ఎంతోగా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. దీని గురించి ఎంత మాట్లాడిన తక్కువే అనిపిస్తుంది. శేఖర్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలి. ఫైనల్ గా కుబేరతో అది కుదరడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇలాంటి కథని ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి వుండము. చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు.”
“నేషనల్ క్రష్ రష్మిక గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమా అంతా ఉంటారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ధనుష్ గారు అద్భుతంగా చేశారు. ఇది వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ గానే కనిపించారు.”
“నాగార్జున గారితో నాది విడదీయలేని బంధం. ఇందులో ఆ క్యారెక్టర్ నాగార్జున గారు చేయకుంటే ఇంక ఎవరితో చేసేవారో ఊహకు అందటం లేదు. అంత రాయల్ గా కనిపించారు. ఈ సినిమా స్టార్ కాస్ట్ అమేజింగ్. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. జూన్ 20న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























