హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ లో ఎన్టీఆర్ కనిపించిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.హృతిక్ కి దీటుగా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించాడు.ఎన్టీఆర్ కాస్ట్యూమ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కాస్ట్యూమ్స్ కి ప్రశంసలు దక్కడం తనను ఆశ్చర్యానికి గురిచేసింది అని అంటుంది ఈసినిమా కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ ఆడజానీయా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వార్ 2 ద్వారా ఎన్టీఆర్ తో మొదటి సారి కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది.ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది.తను సెట్ లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది.ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి.అందుకే తన కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం.ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం.ఓ లక్ష్యంతో పనిచేసే మానవ యంత్రంలా తనను చూపించే ప్రయత్నం చేశామని అనైతా అన్నారు.
బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఇంకో సాంగ్ షూట్ చేస్తే షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 ను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























