టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం జైనబ్‌తో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరి నాగ సుశీల, ఆమె తనయుడు సుశాంత్, మరో సోదరి సంతానం సుప్రియ, సుమంత్ సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై సందడి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కేబినెట్ మంత్రులు, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎమ్మెల్యే సీఎం రమేష్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే చిత్రపరిశ్రమ నుండి, సీనియర్ హీరో వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అడివి శేష్, నిఖిల్, సుధీర్ బాబు, అల్లరి నరేష్ తదితరులు హాజరయ్యారు. ఇంకా కోలీవుడ్ హీరో సూర్య, కన్నడ స్టార్ హీరోలు యష్, సుదీప్ తదితరులు విచ్చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























