కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్ కంప్లీట్

Karthi’s Sardar 2 Wraps Up The Shoot

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా టీం అందరూ సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది.

ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్షన్, రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.