ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో ఆయన పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనదని తెలుస్తోంది. హాస్యం, హృద్యత, భావోద్వేగాలు మిళితమైన ఈ పాత్ర ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని పరిచయం చేయనుందని, అలాగే ఆయన చేరికతో ఈ చిత్రానికి కొత్త ఉత్సాహం మరియు విస్తృత ప్రజాప్రాచుర్యం లభించనున్నదని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా తెలుగు చిత్రసీమలో విభిన్న శైలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సునీల్. హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించిన సునీల్ ఆ తర్వాత హీరోగా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు పోషిస్తూ ముందుకెళ్తున్నాడు. ‘మర్యాద రామన్న, అందాల రాముడు, పుష్ప, పుష్ప 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. “సునీల్ గారు ప్రేక్షకుల్లోకి దగ్గరయ్యే నటుడు మాత్రమే కాదు, ఒక సహజ నటనకు నిలువెత్తు ఉదాహరణ. ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైనది. ఇది హృదయానికి హత్తుకునే, చాలా సహజమైన పాత్ర” అని తెలిపారు.
ఇక ఇందులో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























