కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

తమ్ముడు ట్రైలర్ వస్తోంది

Team Thammudu Announces Trailer Release Date

తమ్ముడు ట్రైలర్ వస్తోంది

Team Thammudu Announces Trailer Release Date

Team Thammudu Announces Trailer Release Date

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. జులై 4న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'మూడ్ ఆఫ్ తమ్ముడు' పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను అందించింది చిత్ర బృందం. ఈనెల 11న తమ్ముడు థియేట్రికల్ ట్రైలర్ రానున్నట్టు అనౌన్స్‌ చేసింది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా లయతోపాటు సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన లేడీస్ యాక్టర్లతో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇది ఫన్నీగా ఉండి ఆకట్టుకుంటోంది.

ఇక ఇటీవల వచ్చిన 'రాబిన్‌హుడ్' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తమ్ముడు చిత్రంతో అయినా ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలనే కసితో వున్నాడు నితిన్. దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సోలోగా రానుండటం కూడా నితిన్‌కి కలిసిరానుంది. మరోవైపు నితిన్ దీనితర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న 'ఎల్లమ్మ'లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రానికి 'బలగం' ఫేమ్ వేణు ఎల్దండి దీనికి దర్శకత్వం వహించనున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్