మెగా 157 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

mega 157 second schedule starts soon

బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ట్ చిరంజీవి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా 157(వర్కింగ్ టైటిల్) గా వస్తున్న ఈసినిమా రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ షెడ్యూల్ అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చిందట.రషెస్ చూసిన వారు వింటేజ్ చిరు కామెడీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక సెకండ్ షెడ్యూల్ ఈనెలలో స్టార్ట్ కానుంది. దాదాపు 10రోజులపాటు ముస్సోరీ ,డెహ్రాడూన్ లలో ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే ఈసినిమాను కూడా తొందరగా పూర్తి చేసేలానే వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ఏడాది చిరంజీవి, విశ్వంభరతో ప్రేక్షలముందుకు రానున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.షూటింగ్ పూర్తి చేసుకోగా విఎఫ్ఎక్స్ పూర్తి కావాల్సివుంది.ఆ తరువాతే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.