టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని హిందీ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేసిన సినిమ జాట్. మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వగా అక్కడ వారికి బాగానే కనెక్ట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను హిందీ తోపాటు తెలుగు భాషలో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి ఈసినిమా తెలుగు ప్రేక్షకులనుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇందులో రణదీప్ హూడా విలన్ పాత్రలో కనిపించగా రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి.ఈసినిమాతో ఈ రెండు తెలుగు టాప్ బ్యానర్లు హిందీలోకి ఎంట్రీ ఇచ్చాయి.
ఇక జాట్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది.అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడప్పుడే ఈసినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు.ఎందుకంటే గోపిచంద్ మలినేని నెక్స్ట్ తెలుగు హీరో తో సినిమా చేయాలని చూస్తున్నాడు. దాని తరువాతే జాట్ 2 ను మొదలు పెట్టనున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























