వేదం.. 15 ఏళ్లు పూర్తి, అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్

Allu Arjun Emotional Post on Vedam Movie as It's Completed 15 Years

‘పుష్ప 2’ చిత్రంతో రూ.1,900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల‌లో ‘వేదం’ ఒకటి. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ 2010లో జూన్ 4వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. అందులో.. “15 సంవత్సరాల వేదం. ఇది నాకు ఊహించని సినిమా. ఇంత నిజాయితీగా సినిమాను రూపొందించినందుకు దర్శకుడు క్రిష్ గారికి ధన్యవాదాలు. నా అద్భుతమైన సహనటులు అనుష్క శెట్టి, హీరో మనోజ్, మనోజ్ బాజ్‌పేయి సర్ మరియు అనేక మంది ఇతరులకు. ఈ ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడం నిజంగా ప్రత్యేకమైనది.” అని తెలిపారు.

ఇంకా ఇలా చెప్పారు.. “ఇంత ధైర్యమైన దార్శనికతకు మద్దతు ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి గారు, నిర్మాతలు శోభు గారు, ప్రసాద్ దేవినేని గారు మరియు మొత్తం బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదం సినిమాను ఆదరించిన అభిమానులందరికీ థ్యాంక్స్. మీరు ఈ సినిమాని ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మార్చారు.” అని పేర్కొన్నారు అల్లు అర్జున్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.