కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలివుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’. జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, భరత్ నారంగ్, సిమ్రాన్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్స్ వివేక, చంద్రబోస్, నంద కిషోర్ పాల్గొన్నారు. వారందరూ ఈ సినిమా గురించి తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అడయార్‌లో పుట్టి, గిండి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నాను. చెన్నై కుటుంబంలో వివాహం చేసుకుని, ఇక్కడే నా కెరీర్‌ను ప్రారంభించాను. చెన్నై ప్రేక్షకుల నుండి సంవత్సరాలుగా తనకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు. కుబేర ఆడియన్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది. శేఖర్ కమ్ముల గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి రెడీ వుంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























