మంచు విష్ణు కెరీర్ లో ఐకానిక్ మూవీ గా నిలిచిన ఢీ మళ్ళీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకోవడం తో ఢీ ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 6న ఈసినిమా మళ్ళీ థియేటర్లలోకి రానుంది. 2007లో మొదటి సారిగా విడుదలై ఢీ సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.శ్రీను వైట్ల మార్క్ కామెడీ సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది.దాదాపు 11 కోట్ల పైనే వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.విష్ణు కెరీర్ లో ఇప్పటికే ఇదే బిగ్గెస్ట్ హిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జెనీలియా ఇందులో హీరోయిన్ గా నటించగా శ్రీహరి ,జయప్రకాష్ రెడ్డి ,బ్రహ్మనందం ,సునీల్ కీలక పాత్రల్లో నటించారు.మణిశర్మ సంగీతం అందించగా మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు.మరి రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇక మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా వున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.మోహన్ బాబు డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈసినిమాలో మోహన్ బాబు , మంచు విష్ణులతోపాటు ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,కాజల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈనెల 27న కన్నప్ప థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























