ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది కన్నడ సినిమా కాంతార. ఈసినిమా తో కన్నడ సినిమా స్థాయి మరింత పెరిగింది.ఒక్క కన్నడ లోనే కాదు కాంతార తెలుగు ,హిందీ భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతుంది.కాంతార చాప్టర్ 1 గా వస్తున్న ఈ సీక్వెల్ అక్టోబర్ 2న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి..రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఇక కాంతార చాప్టర్ 2 కూడా రానుంది.ఈఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ కానుంది.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.కాంతార చాఫ్టర్ 1 రిలీజ్ టైంలో థర్డ్ పార్ట్ ను అనౌన్స్ చేయనున్నారు.
ఇక రిషబ్ శెట్టి ప్రస్తుతం తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.అదే జై హనుమాన్.బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























