ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్

క్వీన్ పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘వేదం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అనుష్క, క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం, అలాగే UV క్రియేషన్స్‌తో కలిసి చేస్తోన్న అనుష్క నాలుగో సినిమా ఘాటి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అనుష్క ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ కీలక అప్డేట్‌తో వచ్చారు. ఘాటి సినిమా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూలై 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.

అయితే ఇంతకుముందు ప్రకటించినట్టు ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కావాల్సివుంది. కానీ, ఈ డేకి ఒకరోజు ముందు (ఏప్రిల్ 17) తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటించిన ‘ఓదెల 2’ చిత్రం థియేటర్లలోకి రావడంతో అప్పుడు మేకర్స్ విడుదల వాయిదా వేశారు. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.

ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే తోట తరణి ఆర్ట్ డైరెక్షన్,, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఘాటి సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.