యూనిక్ స్టార్ నిఖిల్ ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా వెంచర్ ‘స్వయంభు’తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ. నభా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో నిఖిల్ మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఒక లెజెండరీ యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో పాన్-ఇండియా విజన్‌తో రూపొందిస్తున్నారు. స్వయంభు టీం నిఖిల్ పుట్టినరోజున పవర్ ఫుల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
నిఖిల్, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. నిఖిల్ యుద్ధం మధ్యలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్ ఫుల్‌గా కనిపించారు. అతని పక్కన, సంయుక్త విల్లు బాణంతో నిలబడి టార్గెట్‌ని చేరుకున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సినిమా గ్రాండ్ స్కేల్‌ని ప్రజెంట్ చేస్తోంది.
బ్యాక్ డ్రాప్‌లో సెంగోల్ చాలా ఆసక్తికరంగా వుంది. సెంగోల్ శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వాతంత్ర్యం వరకు, సెంగోల్ ఎంతో ప్రాముఖ్యత వుంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం, శ్రీ రాముడు సెంగోల్‌ను నీతిమంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు, ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది.
ఇటీవల, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర సెంగోల్‌ను ప్రతిష్టించారు. ఇప్పుడు, స్వయంభు ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోంది. రాబోయే టీజర్ ఈ ఎక్సయిటింగ్ వరల్డ్‌ని మరింత రివిల్ చేయనుంది.
ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























