రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో ‘ప్రేమిస్తే’ భరత్ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘కాదల్, పట్టియల్, కాలిదాస్’ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఆసక్తికరమైన తారాగణం భాగమవుతోంది. నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే, సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు.
ఇప్పుడు భరత్ చేరికతో ఈ కాంబినేషన్ మరింత బలపడింది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్లు అయింది. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉండనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. “భరత్ ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్ పాత్ర. కథను మలుపు త్రిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది” అని తెలిపారు. సామాజిక నేపథ్యం కలిగిన, గాఢమైన భావోద్వేగ కథనాన్ని అందించడంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే విజయ్ మిల్టన్ ఈ చిత్రంలో కూడా అదే స్థాయిని చూపించబోతున్నారని తెలుస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























